టీఎంసీ మహిళా నేత అనుమానాస్పద మృతి

Body of 48-year-old TMC female worker found with deep cuts on throat. పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని కానింగ్ పట్టణంలో శనివారం

By M.S.R  Published on  14 Feb 2023 6:00 PM IST
టీఎంసీ మహిళా నేత అనుమానాస్పద మృతి

పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని కానింగ్ పట్టణంలో శనివారం మహిళా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కార్యకర్త మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలిని సుచిత్ర మండల్ (48)గా గుర్తించారు. తన పొలాన్ని సందర్శించడానికి వెళ్లిన ఆమె ఎంత సమయానికీ తిరిగి రాలేదని అక్కడకు వెళ్లి చూస్తే ఆమె మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని మృతురాలి కుటుంబీకులు, స్థానికులు తెలిపారు.

ఆమె గొంతుపై లోతైన కోతలు ఉన్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో మహిళను హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సుచిత్ర చాలా కాలంగా స్థానికంగా టిఎంసి పార్టీలో క్రియాశీల సభ్యురాలు. హత్యకు సంబంధించి రాజకీయ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story