దారుణం.. ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ.. స్కూల్ యూనిఫాంలోనే..

ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలోని ఒక అడవిలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయని పోలీసులు శనివారం తెలిపారు.

By అంజి
Published on : 9 Feb 2025 7:15 AM IST

Bodies of two girls, school uniforms, hanging, Odisha, Crime

దారుణం.. ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ.. స్కూల్ యూనిఫాంలోనే..

ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలోని ఒక అడవిలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయని పోలీసులు శనివారం తెలిపారు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన బాలికలను MV 74 గ్రామానికి చెందిన టినార్ హల్దార్ కుమార్తె జ్యోతి హల్దార్ (13), MV 126 గ్రామానికి చెందిన బాగా సోది కుమార్తె మందిరా సోది (13)గా గుర్తించినట్లు ఒక అధికారి తెలిపారు. ఇద్దరూ స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. గురువారం పాఠశాల ముగిసిన తర్వాత వారు ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారు ఇద్దరు మైనర్ల కోసం వెతికారు కానీ వారి ఆచూకీ దొరకలేదు.

ఈ క్రమంలోనే మందిరా సోది తల్లి.. మమతా సోది శుక్రవారం MV 79 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అడవిలోని ఒక చెట్టుకు వేలాడుతూ రెండు మృతదేహాలను స్థానికులు కనుగొన్నారని అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న తర్వాత, మల్కన్‌గిరి ఎస్‌డీపీవో సచిన్ పటేల్‌తో పాటు MV 79 పోలీస్ స్టేషన్, మోటు పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

Next Story