నంబర్ ప్లేట్ లేకుండా ప‌ట్టుబ‌డ్డ‌ KTM బైక్.. గ్యాంగ్ ఎలా దొరికిపోయిందంటే.?

కూకట్‌పల్లి ఆ పరిసరాల్లో వాహనాల దొంగతనానికి సంబంధించి ఒక వ్యాపారవేత్తతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 30 Aug 2025 8:00 PM IST

నంబర్ ప్లేట్ లేకుండా ప‌ట్టుబ‌డ్డ‌ KTM బైక్.. గ్యాంగ్ ఎలా దొరికిపోయిందంటే.?

కూకట్‌పల్లి ఆ పరిసరాల్లో వాహనాల దొంగతనానికి సంబంధించి ఒక వ్యాపారవేత్తతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తులను గొల్లపల్లి శ్రీధర్ (26) ఎలక్ట్రీషియన్, మిద్దె వీర కౌసిక్ గౌడ్ (21), కట్టా మణికంఠ (20), గుత్తుల శ్రీనివాస్ (28) షేక్ నాగూర్ వలి (25) గా గుర్తించారు. శ్రీధర్, గౌడ్, మణికంఠ, శ్రీనివాస్ కూకట్‌పల్లి నివాసితులు కాగా, వలి గుంటూరు జిల్లాకు చెందినవాడు.

ఆగస్టు 24న, గుర్తు తెలియని వ్యక్తులు జగద్గిరిగుట్టలోని ఒక వైన్ షాపుకి వచ్చి, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ (KPHB) నివాసి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన గఫూర్ రాజాకు చెందిన బైక్‌ను దొంగిలించారు. అతని ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా, నంబర్ ప్లేట్ లేకుండా బైక్ నడుపుతున్న శ్రీధర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. విచారణలో శ్రీధర్ తన సహచరులు గౌడ్, మణికంఠ, శ్రీనివాస్ లతో కలిసి KPHB, బోరబండ, అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతర బైక్ లతో పాటు ఒక KTM బైక్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. కొన్ని బైక్ లను వలి కు విక్రయించారు. అరెస్టు చేసిన వ్యక్తుల నుండి రూ.42 లక్షల విలువైన 22 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. నరేష్ రెడ్డి తెలిపారు.

Next Story