ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు యువ‌కులు దుర్మ‌ర‌ణం

Bike Collides with bolero near Alampur.జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2023 10:46 AM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు యువ‌కులు దుర్మ‌ర‌ణం

జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదివారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బైక్‌ను బొలెరో వాహ‌నం ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు.

మానవపాడు మండలం కొరివిపాడు గ్రామానికి చెందిన సాయి, రఫీ, శేఖర్‌గౌడ్ లు అలంపూరులో మ‌హాశివ‌రాత్రి వేడుల‌క‌లో పాల్గొన్నారు. వేడుక‌ల అనంత‌రం తిరిగి స్వ‌గ్రామానికి బైక్ పై బ‌య‌లు దేరారు. తెల్ల‌వారుజామున బైరాపూర్‌ సమీపంలో బొలెరో వాహ‌నం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బైక్‌పై వెలుతున్న ముగ్గురు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్ట్ మార్టం నిమిత్తం అలంపూర్‌ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story