దొంగతనం చేశాడని వ్యక్తిని తాడుతో కట్టేసి.. ప్రైవేట్ పార్ట్‌లో కారం పొడి పోసి..

బీహార్‌లోని అరారియాలో ఓ వ్యక్తిని తాడుతో కట్టి, అతని ప్రైవేట్ పార్ట్‌లో కారం పొడిని నింపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

By అంజి  Published on  28 Aug 2024 1:46 AM GMT
Bihar, Chilli powder,  Tejashwi Yadav, Taliban rule, Crime, Islamnagar

దొంగతనం చేశాడని వ్యక్తిని తాడుతో కట్టేసి.. ప్రైవేట్ పార్ట్‌లో కారం పొడి పోసి.. 

బీహార్‌లోని అరారియాలో ఓ వ్యక్తిని తాడుతో కట్టి, అతని ప్రైవేట్ పార్ట్‌లో కారం పొడిని నింపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో వ్యక్తిని తన చేతులు వెనుకకు కట్టి ఉన్న దృశ్యాన్ని చూపిస్తుంది. అతని ప్యాంటు విప్పబడి మోకాళ్ల వరకు ఉంది. అయితే నిందితులు అతన్ని కిందికి వంగమని బలవంతం చేశారు. వీడియోలోని వ్యక్తి దొంగిలించాడని ఆరోపించిన కొంతమంది వ్యక్తులు.. అతడిని బంధించారు. మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మహ్మద్ సిఫత్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

నిందితులు బాధితుడి ప్రైవేట్‌ పార్ట్‌లో కారం పోసి.. పెన్సిల్‌తో నెట్టడం కనిపించింది. దీని తరువాత, నిందితుడు వ్యక్తి ప్యాంటు పైకి లాగడం, బటన్‌ పెట్టడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా అక్కడున్న పలువురు వ్యక్తులు రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు ఈ ఘటనపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్‌డిఎ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన తేజస్వి యాదవ్ ఈ సంఘటన బీహార్‌లో "తాలిబాన్ రాజ్"ని చూపిందని అన్నారు.

"నేను, నా పార్టీ దళితులు, వెనుకబడిన, మైనారిటీల హక్కులు, వాటా గురించి మాట్లాడుతాము, అందుకే కులవాదులు ఎల్లప్పుడూ మా పాలనను జంగిల్ రాజ్‌గా చూస్తారు" అని తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. అరారియాలోని ఇస్లాంనగర్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 109 (హత్యాయత్నం) , సెక్షన్ 117(4) (5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమూహం వల్ల కలిగే తీవ్రమైన గాయం) కింద మంగళవారం కేసు నమోదు చేయబడింది. ఈ ఘటనలో ప్రమేయమున్న ఇతరులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story