ప్రొఫైల్ పిక్‌లో బయటపడ్డ ఆడపడుచు క్రూరత్వం.. మలక్ పేట శిరీష హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
మలక్ పేట శిరీష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Medi Samrat Published on 6 March 2025 2:35 PM IST
మలక్ పేట శిరీష హత్య కేసులో సంచలమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిరీషను ఆడపడుచు సరిత హత్య చేసినట్లుగా నిర్ధారణ కావడంతో పోలీసులు శిరీష భర్త వినయ్‌తో పాటు ఆడపడుచు సరితను అరెస్టు చేసే రిమాండ్‌కు తరలించారు. అయితే శిరీషను చంపిన సరిత క్రూరత్వంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆడపడుచు సరిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రొఫైల్ పిక్‌లో ఆమె క్రూరత్వం బయటపడింది. నన్ను తట్టుకొని నిలవాలంటే మూడే దారులు.. మారిపోవాలి, పారిపోవాలి లేదా సచ్చిపోవాలి అంటూ సవాలు విసిరింది. అంతేకాకుండా నువ్వు సవాలు విసరకు.. నేను శవాలు విసురుతా.. అనే టైటిల్ తో ఉన్న పిక్ పెట్టుకుంది. సరిత సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది..
శిరీష ఆడపడుచు సరిత, ఆమె భర్త అమెరికాలో నివాసం ఉండేవారు. అయితే సరిత గురించి తెలిసి ఆమె భర్త ఆమెను దూరం పెట్టాడు. అంతేకాకుండా అమెరికా నుండి సరితను బలవంతంగా ఇండియాకు పంపించాడు. ఆరు నెలల క్రితం ఇండియాకి వచ్చిన సరిత ఇక్కడ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న శిరీష పలుమార్లు ఆడపడుచును మందలించింది. దీంతో మండిపడిన సరిత ఎలాగైనా సరే శిరీషను అంతమొందించాలని పథకం పన్నింది. పథకం ప్రకారం.. శిరీషను చంపేందుకు పలు మార్లు స్కెచ్ వేసింది. అయితే ఆ ప్లాన్‌లు విఫలమయ్యాయి. చివరకు శిరీష మత్తు ఇంజక్షన్ తీసుకుంటుందని తెలుసుకున్న సరిత.. అధిక డోసు ఇచ్చి స్పృహ కోల్పోయేటట్లు చేసింది. అనంతరం దిండు మొహం మీద పెట్టి ఊపి రాడకుండా చేసి చంపేసింది. హత్య చేసిన అనంతరం సరిత, వినయ్ ఇద్దరు కలిసి శిరీష మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ శిరీష మేనమామ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకొని మృతదేహాన్ని తీసుకువెళుతున్న అంబులెన్స్‌ను ట్రేస్ చేసి పట్టుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టంలో శిరీష గుండె పోటుతో మరణించలేదని.. హత్య చేసినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు వెంటనే సరిత, వినయ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే.. శిరీష మర్డర్ కేస్‌లో హాస్పిటల్ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించారు. నిందితురాలు సరిత ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మేనేజర్‌గా పని చేస్తుంది. ఐసీయూ పేషంట్‌లకు ఇచ్చే మత్తు ఇంజెక్షన్‌లను హాస్పిటల్ నుండి తమకు తెలీకుండానే తీసుకెళ్ళి ఉండవచ్చునని హాస్పిటల్ వర్గాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. సరిత ఆ మత్తు ఇంజెక్షన్లే డోసేజ్ పెంచి శిరీషకు ఇచ్చినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.