నకిలీ ఈ-చలాన్ స్కామ్.. హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
ట్రాఫిక్ పోలీసుల చలాన్ల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త రకం స్కామ్‌ను ఎంచుకున్నారు.
By అంజి Published on 30 Aug 2023 1:15 PM ISTనకిలీ ఈ-చలాన్ స్కామ్.. హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసుల చలాన్ల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త రకం స్కామ్‌ను ఎంచుకున్నారు. వాహనదారులకు ఈ-చలాన్ మెసేజ్‌లను పంపి దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ మోసపూరిత స్కామ్‌తో ఈ చలాన్లకు కొత్త ముప్పు ఏర్పడింది. టార్గెట్ చేసిన వ్యక్తిని దోచుకోవడమే లక్ష్యంగా కొత్త ఈ-చలాన్ స్కామ్ గురించి పోలీసు శాఖ హెచ్చరిక జారీ చేసింది. పోలీసుల ప్రకారం.. వ్యక్తులు తమ మొబైల్ పరికరాలలో ఈ-చలాన్ నోటిఫికేషన్‌లకు సంబంధించిన లింక్‌లతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించాలి. నకిలీ లింక్‌లను ప్రజలతో పంచుకోవడం ద్వారా సైబర్ మోసగాళ్లు ఆన్‌లైన్ చలాన్ చెల్లింపును సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ మోసపూరిత లింక్‌లపై క్లిక్ చేయడం వల్ల బాధితులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లేదా నకిలీ లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండాలని పోలీసులు కోరారు. ఈ-చలాన్ల పంపినప్పుడు పోలీసులు అందించిన సాధారణ లింక్ https://echallan.parivahan.gov.in. ఈ విధంగా ఉంటుంది. అయితే మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు https://echallanparvahan.in వంటి నకిలీ చలాన్ లింక్‌లను సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ మోసపూరిత వ్యూహాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పారు. నకిలీ లింక్‌లపై క్లిక్ చేయడం వల్ల బ్యాంక్ ఖాతాలకు అనధికారిక యాక్సెస్, ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఈ-చలాన్ నోటిఫికేషన్‌ల ప్రామాణికతను ధృవీకరించాలని, చలాన్‌ల ఆన్‌లైన్ చెల్లింపు కోసం అధికారులు అందించిన అధికారిక లింక్‌లను మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.
Don't Fall for the Fake E-Challan Scam!"🚦🚗🛵 Your Safety is Your Responsibility.🪖#TrafficFines #FakeEChallan #India #staysafeonline #cybersecurity #g20india #g20summit #ssoindia #meity #mygovindia #Quad pic.twitter.com/kQ63xukrB9
— Information Security Awareness (ISEA) by MeitY (@InfoSecAwa) August 28, 2023