దారుణం.. తండ్రి అప్పుకట్టలేదని కూతురిపై అత్యాచారం

బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి అప్పు కట్టలేదని అతని మైనర్‌ కుమార్తెపై ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  21 Oct 2024 1:50 PM IST
Bengaluru Man, Arrest, Pending Loan, Crime

దారుణం.. తండ్రి అప్పుకట్టలేదని కూతురిపై అత్యాచారం

బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి అప్పు కట్టలేదని అతని మైనర్‌ కుమార్తెపై ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పు తిరిగి చెల్లించనందుకు ప్రతీకారంగా 17 ఏళ్ల మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన 39 ఏళ్ల వ్యక్తిని మదనాయకహళ్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రవి కుమార్‌ అనే వ్యాపారి వద్ద బాలిక తండ్రి రూ.70,000 అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.30 వేలు తిరిగిచ్చాడు. మిగతా రూ.40 వేలు, వడ్డీ కోసం రవి కుమార్‌ నిత్యం వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పు చెల్లించాలని బాలికను బెదిరించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.

మైనర్‌కు బలవంతంగా బుగ్గపై ముద్దుపెట్టి ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. మైనర్ కుటుంబం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతనిపై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అత్యాచారం, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద లైంగిక వేధింపుల అభియోగాలు మోపారు. ఆదివారం తాను ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వేగంగా స్పందించి అదే రోజు రవికుమార్‌ను అరెస్టు చేశారు.

Next Story