హైదరాబాద్ నగర పరిధిలోని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని ఓ బార్‌లో జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే బీరు బాటిల్‌తో దాడి చేయడంతో ఒకరు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడ్ డే బార్‌లో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బార్ లోపల టేబుళ్ల వద్ద ఉన్న గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. ఆ సమయంలో శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి.. పవన్ కుమార్‌పై దాడి చేశాడు.
పోలీసులు మాట్లాడుతూ.. ''నిన్న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో, గుడ్ డే బార్‌లో కొంతమంది సభ్యులు మద్యం సేవిస్తుండగా, సమీపంలోని టేబుల్ వద్ద ఉన్న వ్యక్తులతో గొడవ జరిగింది. శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి పవన్ కుమార్ తలపై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు, దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. నిందితుడు, మృతుడు హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందినవారు. కేసు నమోదు చేయబడింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష (PME) కోసం తరలించారు. మరిన్ని వివరాలను తరువాత అందిస్తాము'' అని చెప్పారు.
ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.