దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ నర్సుపై ఆటోరిక్షా డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంధేరి (డబ్ల్యూ)లోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో ఉద్యోగం చేస్తున్న 24 ఏళ్ల నర్సుపై వేధింపులకు పాల్పడినందుకు ఆటోరిక్షా డ్రైవర్‌ను ఆదివారం జుహు పోలీసులు అరెస్టు చేశారు. రిపోర్టు ప్రకారం.. ఫిబ్రవరి 17 న నర్సు తన నైట్ షిఫ్ట్ డ్యూటీ నుండి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. బాధితురాలు బస్టాప్‌లో వేచి ఉన్న సమయంలో నిందితుడు దినేష్ చౌరసియా ఆమె వద్దకు వచ్చి తన ఆటో రైడ్ కావాలా అని అడగ్గా.. అంధేరి రైల్వే స్టేషన్‌లో దింపాలని బాధితురాలు కోరింది.
అతను బాధితురాలికి రైడ్ కోసం తగ్గింపు రేటును కూడా ఇచ్చాడు, దానికి నర్సు అంగీకరించి ఆటో ఎక్కాడు. అయితే నిందితుడు నర్సును స్టేషన్‌కు తీసుకెళ్లడానికి బదులు జుహులోని గుల్‌మొహర్ రోడ్డులోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా ఆమెపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో పట్టుబడతానేమోనని భయపడి, నిందితుడు వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. అయితే, నర్సు ఆటో నంబర్‌ను నమోదు చేసి, నిందితులపై ఫిర్యాదు చేయడానికి జుహు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నర్సు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. విచారణలో, నిందితుడిని ఆదివారం కండివలి నుండి పట్టుకున్నారు.