ఎల్బీన‌గ‌ర్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలిక‌పై ఆటోడ్రైవ‌ర్ అఘాయిత్యం

Auto driver arrested for Molesting minor girl in LB Nagar.క‌ఠిన చ‌ట్టాలు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2022 12:05 PM IST
ఎల్బీన‌గ‌ర్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలిక‌పై ఆటోడ్రైవ‌ర్ అఘాయిత్యం

క‌ఠిన చ‌ట్టాలు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కామాంధుల‌కు వావి-వరుస‌, చిన్నా పెద్దా తేడా లేదు. అభం శుభం తెలిసిన బాలిక‌ల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు. జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచార ఘ‌ట‌న మ‌రువ‌క ముందే హైద‌రాబాద్ న‌గ‌రంలో ఓ దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. తొమ్మిదేళ్ల బాలిక‌పై ఓ ఆటో డ్రైవర్‌ మైనర్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

వివ‌రాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ న‌గ‌ర్‌కు చెందిన స‌లీమ్ అనే వ్య‌క్తి ఆటో డ్రైవ‌ర్‌. అత‌డు ఓ తొమ్మిదేళ్ల బాలిక‌పై క‌న్నేశాడు. ఈ క్ర‌మంలో బాలిక‌ను బెదిరించి గ‌త మూడు రోజులుగా లైంగిక దాడికి పాల్ప‌డుతున్నాడు. విష‌యాన్ని బాధితురాలు త‌ల్లికి చెప్ప‌డంతో వెలుగులోకి వ‌చ్చింది. బాలిక త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు బాలిక‌ను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌లీమ్ ను అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story