దారుణం.. కూరగాయలు కోసే కత్తితో.. అన్నని హతమార్చిన తమ్ముడు

Atrocity in Medak district.. Elder brother was killed by younger brother. అన్నకు తోడుగా ఉండాల్సిన తమ్ముడు దారుణానికి తెగబడ్డాడు. తల్లిదండ్రులను వేధిస్తున్నాడని అన్నని అతి కిరాతకంగా

By అంజి  Published on  16 Aug 2022 6:07 PM IST
దారుణం.. కూరగాయలు కోసే కత్తితో.. అన్నని హతమార్చిన తమ్ముడు

అన్నకు తోడుగా ఉండాల్సిన తమ్ముడు దారుణానికి తెగబడ్డాడు. తల్లిదండ్రులను వేధిస్తున్నాడని అన్నని అతి కిరాతకంగా హత్య చేశాడు. రక్తం పంచుకుని పుట్టిన సొంత అన్నను తమ్ముడు హత మార్చాడు. ఈ దారుణ ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌ పట్టణానికి చెందిన చిత్తారి బుచ్చమ్మ, నర్సింలు దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద కొడుకు లక్ష్మణ్‌ అలియాస్‌ ఓంకార్‌ (38) ఇంటి దగ్గరు ఉంటున్నారు.

చిన్న కుమారుడు శేఖర్ పటన్ చెరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల కిందట లక్ష్మణ్‌ అతని భార్యతో గొడవపడ్డాడు. దీంతో భార్య ఆమె పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి లక్ష్మణ్‌ మనస్థాపంతో మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. మద్యం మత్తులో వారిని కొట్టేవాడు. ఈ క్రమంలోనే పెద్ద కొడుకు ఇబ్బందులు తాళలేక.. చిన్న కొడుకును తల్లిదండ్రులు ఇంటికి పిలిచి జరిగిన విషయం చెప్పారు.

ఈ క్రమంలోనే తమ్ముడు శేఖర్‌ ఎదుటనే అన్న లక్ష్మణ్‌ మరోసారి తల్లిదండ్రులపై చేయి ఎత్తాడు. అన్నని తమ్ముడు సముదాయించే ప్రయత్నం చేశాడు. సోమవారం నాడు అన్నదమ్ములు ఇద్దరు మద్యం సేవించారు. మళ్లీ మాటమాట పెరగడతో తీవ్రంగా కోపానికి వచ్చిన తమ్ముడు శేఖర్‌.. అన్నని కూరగాయలు కోసే కత్తితో చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్న లక్ష్మణ్‌ హత్య నర్సాపూర్‌ పట్టణంలో కలకలం రేపింది.

Next Story