హైదరాబాద్‌లో దారుణం.. భర్తపై ప్రియుడితో కలిసి భార్య హత్యాయత్నం

పచ్చని సంసారంలో కొందరు మహిళలు కావాలనే నిప్పులు పోసుకుంటున్నారు. తాళి కట్టిన భర్త కంటే పరిచయమైన వ్యక్తులనే ఇష్టపడు తున్నారు.

By అంజి
Published on : 17 Jun 2025 9:27 AM IST

Hyderabad, murder attempt, Crime, Asif Nagar

హైదరాబాద్‌లో దారుణం.. భర్తపై ప్రియుడితో కలిసి భార్య హత్యాయత్నం

పచ్చని సంసారంలో కొందరు మహిళలు కావాలనే నిప్పులు పోసుకుంటున్నారు. తాళి కట్టిన భర్త కంటే పరిచయమైన వ్యక్తులనే ఇష్టపడు తున్నారు. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతుంది. తర్వాత సహజీవనం.. విషయం తెలుసుకున్న భర్తను ఎలాగైనా సరే అంతం చేయాలన్న కోపం.. చివరకు మూడు ముళ్ల బంధాన్ని ముచ్చటగా అంతం చేసేందుకు ప్లాన్.. కట్ చేస్తే పోలీసుల చేతికి చిక్కడం వంటి ఎన్నో ఘటనలు జరు గుతున్నాయి. ఈ వివాహేతర సంబంధం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. ఎందరో పిల్లలు అనాథలవుతున్నారు. అయినా కూడా ఈ ఘటనలు ఆగడం లేదు.. ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

షైస్తా అనే యువతి ఏడాది క్రితం ఒసామా అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఆసిఫ్ నగర్ లో నివాసం ఉంటోంది. ఆరు నెలల క్రితం షైస్తా తన భర్త ఒసామాను దుబాయ్ కి పంపింది.. అనంతరం షైస్తాకి అమీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆమె తన ప్రియుడితో కలిసి సహజీవనం కొనసాగించింది. ఇటీవల ఇంటికి తిరిగి వచ్చిన భర్త ఒసామా తన భార్య షైస్తాకు అమీర్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా గుర్తించి భార్యను నిలదీశాడు. పద్ధతి మార్చుకోవాలని చెప్పినా కూడా భార్య షైస్తా తీరు మారలేదు.

తన వ్యవహారం కాస్త బయటపడడంతో ఎలాగైనా సరే భర్తను అంతం చేయాలని పథకం పన్నింది. పథకం ప్రకారమే.. తన భర్తను అంతం చేయడానికి ఒక గ్యాంగ్ కు సుఫారీ కూడా ఇచ్చింది. సుఫారి గ్యాంగ్, ప్రియుడితో కలిసి తన భర్త ఒసామాపై దాడి చేసింది. భర్త ఒసామా కి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయాడని భావించి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే స్థానికులు అతని చూసి వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఒసామా ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story