హైదరాబాద్‌లో విషాదం.. కొడుకు, కూతురిని చంపి.. ఆపై దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ మహా నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకు, కూతురిని చంపి.. భార్య,భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

By అంజి  Published on  11 March 2025 6:55 AM IST
Hyderabad,  killed, suicide, Habsiguda, Crime

హైదరాబాద్‌లో దారుణం.. కొడుకు, కూతురిని చంపి.. ఆపై దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ మహా నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొడుకు, కూతురిని చంపి.. భార్య,భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలోని హబ్సిగూడ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్‌ రెడ్డి (44) ఫ్యామిలీ సంవత్సరం కిందట హబ్సిగూడకు వచ్చింది. ఆయన కొన్ని రోజులు ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పని చేసి మానేశారు. 6 నెలలుగా ఉద్యోగం చేయకపోవడంతో కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు తీవ్ర మయ్యాయి. దీంతో ఎం చేయాలో పాలు పోలేదు. ఈ క్రమంలోనే కొడుకు విశ్వాన్‌ రెడ్డి (10) విషం ఇచ్చి, కూతురు శ్రీత రెడ్డిని (15) ఉరేసి చంపినట్టు పోలీసులు ఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్ల ఆధారంగా అంచనాకు వచ్చారు.

ఆ తర్వాత భార్య కవితతో (35)తో కలిసి చంద్రశేఖర్‌ రెడ్డి ఉరేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోద చేశారు. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించినట్టు సమాచారం. తన చావుకి ఎవరూ కారణం కాదని, వేరే మార్గం లేక సూసైడ్‌ చేసుకుంటున్నా.. కెరీర్‌లోనూ, శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా, మధుమేహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నా అని సూసైడ్‌ నోట్‌లో చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story