హైదరాబాద్‌లో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం
మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ తార్నాక్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 18 Dec 2023 11:44 AM ISTహైదరాబాద్‌లో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్‌లోని తార్నాకలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర సంచలనం రేగింది. చిన్న, పెద్ద తేడా లేకుండా కామాంధులు.. ఆడవారు కనిపించారంటే చాలు అదును చూసి వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా నగరంలో రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న ఓ మహిళను లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఓ వ్యక్తి అపహరించుకుపోయాడు. ఆపై తన స్నేహితులతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్‌దత్ వెల్లడించారు.
మెకానిక్‌గా పనిచేస్తున్న బర్నే ఏసు(32) ఈనెల 7న అర్ధరాత్రి తార్నాక నుంచి ప్రశాంత్‌నగర్‌కు బైక్‌పై వెళుతున్నాడు. అదే ప్రాంతంలో ఓ మహిళ బస్ స్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తోంది. అటుగా వెళ్తున్న ఏసు, మహిళ ఒంటరిగా ఉండటం గమనించి ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెతో మాట కలిపాడు. లాలాపేటలో దింపుతానని నమ్మించి, తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఆమెను తప్పుదోవ పట్టించి ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడని పోలీసు అధికారి తెలిపారు.
అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ ఏసు.. ఆ తర్వాత తన ఫ్రెండ్ సీత మధుయాదవ్(31)ను పిలిపించి ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. శ్రీగిరి ప్రశాంత్ కుమార్(20), రోహిత్(19), తరుణ్ కుమార్(20)లను పిలిపించి ఐదుగురు కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి దిగారు. అనంతరం మధుయాదవ్ ఆమెను తార్నాకలో దింపి అక్కడి నుంచి పరారయ్యాడు అని డీసీపీ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఐదుగురు నిందితులను గుర్తించారు. ఆదివారం రోజున వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.