Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకం కలకలం రేపింది. గోపన్ పల్లి తండాలో యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు.

By అంజి  Published on  29 Aug 2024 4:58 AM GMT
Gachibowli, Hyderabad, Crime

Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకం కలకలం రేపింది. గోపన్ పల్లి తండాలో యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన రాకేష్ (25) అనే యువకుడు టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన గ్రీష్మ(33) అనే యువతి జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి హెయిర్ సెలూన్ లో బ్యూటిషన్ గా పని చేస్తోంది. రాకేష్ కి గ్రీష్మ తో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. గత కొద్ది రోజుల నుండి గ్రీష్మ రాకేష్ ను దూరం పెట్టడంతో ఇద్దరు మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రియుడు రాకేష్ నిన్న ఆర్డరాత్రి సమయంలో గ్రీష్మ ఇంటికి వచ్చి... మాట్లాడుకుందాం రా అని బయటకు పిలిచి.. గ్రీష్మ మీద ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అది గమనించిన ముగ్గురు యువతులు అతడిని అడ్డుకు న్నారు.

అయినా కూడా రాకేష్ రెచ్చిపోయి... గ్రీష్మ ను విచక్షణారహితంగా కత్తితో పొడిచి, అడ్డు వచ్చిన వారిపై కత్తితో దాడి చేసి అనంతరం అక్కడి నుండి పారిపోయాడు. ఈ దాడిలో ముగ్గురు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు రక్తపు మడుగులో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గ్రీష్మ మృతి చెందింది. హత్య చేసిన అనంతరం రాకేష్ మొయినాబాద్ లో కరెంట్ వైర్లు పట్టుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story