హైదరాబాద్ ఆస్పత్రిలో ఘోరం.. రోగి సోదరిపై అత్యాచారం.. లిఫ్ట్‌లో వెళ్తుంటే
సోదరుడికి చికిత్స చేయించడానికి సహాయకురాలిగా వచ్చిన యువతిపై ఈఎస్‌ఐ ఆసుపత్రిలోని క్యాంటీన్ సిబ్బంది ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 17 Sept 2023 10:00 AM ISTహైదరాబాద్ ఆస్పత్రిలో ఘోరం.. రోగి సోదరిపై అత్యాచారం.. లిఫ్ట్‌లో వెళ్తుంటే
ఆడవారికి తల్లి గర్భంలో తప్ప మరేక్కడా రక్షణ లేకుండా పోయింది. కామాంధులు అభం శుభం తెలియని చిన్నారులపై దాడి చేసి వారి కామ దాహన్ని తీర్చుకుంటున్నారు. ప్రాణాలు కాపాడే ఆస్పత్రిలోనే ఒక కామపిశాచి మైనర్ బాలిక జీవితాన్ని అంధకారం చేశాడు. ఆస్పత్రి లిఫ్ట్‌లో యువతిని భవనంపై అంతస్తుకు తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ సనత్ నగర్‌లోని ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకకు చెందిన ఓ యువతి (19) సోదరుడు కాలు జారి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అతడికి సోదరి చికిత్స చేయించింది. ఇటీవల మళ్లీ నొప్పి రావడంతో ఈ నెల 6న సోదరుడిని తీసుకొని ఆసుపత్రికి వచ్చింది యువతి. ఆస్పత్రిలోనే ఇన్‌షేషంట్‌గా చేరడంతో అక్కడే ఉంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు రాత్రి తన సోదరుడికి ఆహారం తీసుకొచ్చేందుకు ఆరో అంతస్తు నుంచి కిందకు వచ్చింది. తిరిగి వెళ్తుంటే ఆస్పత్రికి సెక్యూరిటీ గార్డు ఆమెకు తారసపడ్డాడు. క్యాంటీన్‌లో పని చేసే షాదాబ్(25) పరిచయం చేశాడు.
ఆ తర్వాత ఆమె తిరిగి లిఫ్ట్‌లో వెళ్తుంటే షాదాబ్ ఆమె వెనకాల వచ్చి భవనంపై అంతస్తులోని చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బ్లడ్ టెస్ట్ చేసే ల్యాబ్‌లో మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి సోదరుడికి ఫోన్ చేయగా.. అతను రెండో అంతస్తుకు చేరుకొని గట్టిగా కేకలు వేశాడు. దీంతో నిందితుడు పారిపోయాడు. ఆసుపత్రి అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నిందితుడు షాదాబ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అత్యాచారం అయినట్టుగా ఈఎస్ఐ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించారు. అమ్మాయి మైనర్ కావడంతో వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు.