Telangana: గురుకులంలో దారుణం.. బాలికపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక దాడి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది.
By - అంజి |
Telangana: గురుకులంలో దారుణం.. బాలికపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక దాడి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది. విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పింది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జడ్చర్ల మండల కేంద్రంలోని ఒక గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి లైంగిక దాడికి పాల్పడింది. దీనిపై ప్రిన్సిపాల్ కు బాధితురాలు కంప్లెంట్ చేసింది. అయితే ఆమె ఈ విషయాన్ని దాచిపెట్టడంతో పాటు విద్యార్థినిని భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులతో పాటు జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేసింది.
బాధిత బాలిక తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి ఈ ఘటనపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని జడ్చర్ల పోలీసులను ఆదేశించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై మల్లేశ్ తెలిపారు. అటు బాలికను విచారించి వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ రజిని రాగమాలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.