బాలికకు మద్యం తాగించి అత్యాచారం.. యువకుడి అరెస్ట్‌

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో గైఘాటా పోలీసులు గురువారం ఉదయం మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అరెస్టు చేశారు.

By అంజి  Published on  14 Nov 2024 12:38 PM IST
West Bengal, alcohol, arrest, Crime

బాలికకు మద్యం తాగించి అత్యాచారం.. యువకుడి అరెస్ట్‌

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో గైఘాటా పోలీసులు గురువారం ఉదయం మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అరెస్టు చేశారు. అత్యాచారం సంఘటన నవంబర్ 10 రాత్రి జరిగినప్పటికీ, బాధితురాలి తల్లిదండ్రులు బుధవారం రాత్రి గైఘాటా పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయగా, నిందితుడైన యువకుడిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులకు నమోదైన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు ఆహ్వానించడంతో, బాధితురాలు తన పుట్టినరోజు వేడుకకు హాజరు కావడానికి అతని నివాసానికి వెళ్లింది. అక్కడ నిందితుడు ఆమె తాగిన శీతల పానీయాలలో మద్యం కలిపినట్లు సమాచారం.

ఆమె మద్యం మత్తులో ఉండటంతో నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె తిరిగి తేరుకున్న తర్వాత, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని నిందితుడు బెదిరించాడు. దీంతో మొదట్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు తన తల్లిదండ్రులకు విషయం చెప్పలేదు. ఎట్టకేలకు బుధవారం రాత్రి తన తల్లిదండ్రులకు విషయాన్ని వెల్లడించడంతో వారు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు గైఘాట్‌ పోలీసులు నిందితుడిని గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Next Story