భార్య విడాకులు ఇవ్వట్లేదని.. గొంతు కోసుకున్న భర్త

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్తగారి ఇంటి ముందు హల్‌చల్ చేసిన అల్లుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  11 Feb 2024 3:57 PM IST
Rajanna Sirisilla district, suicide, divorce, Crime news

భార్య విడాకులు ఇవ్వట్లేదని.. గొంతు కోసుకున్న భర్త 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్తగారి ఇంటి ముందు హల్‌చల్ చేసిన అల్లుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా పలువురిని భయభ్రాంతులకు గురి చేసింది. సామ కళాధర్ రెడ్డి అనే యువకుడు వికారాబాద్ జైల్లో వార్డెన్‌గా పని చేస్తు న్నాడు. బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన గడ్డం రాజిరెడ్డి కూతురితో కళాధర్ రెడ్డికి వివాహం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ కళాధర్ రెడ్డి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కాపురానికి రమ్మని ఎన్నోసార్లు కళాధర్ అత్తగారి ఇంటికి వెళ్లి తన భార్యని బతిమిలాడాడు.

అయినా కూడా భార్య అతని ఇంటికి రాలేదు. దీంతో సామ కళాధర్ రెడ్డి విసుగు చెందాడు. భార్య నుండి విడాకులు కావాలని అడిగాడు. అందుకు కూడా భార్య నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా కళాధర్ రెడ్డి కాపురానికి రాకుండా వేధిస్తున్నందుకు విడాకులు ఇవ్వాలని రామన్న పేటలో అత్తగారి ఇంటి ముందు నానా హంగామా సృష్టించాడు. అంతేకాకుండా ఇంట్లో వారందరిని దుర్భాషలాడుతూ.. ఒక్కసారిగా కళాధర్ కత్తి తీసుకొని తన గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కళాధర్ రెడ్డిని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story