లిప్‌స్టిక్‌ పెట్టుకొని అందంగా తయారవుతోందని.. భార్యను కిరాతకంగా చంపిన భర్త

భార్య అందంగా రెడీ అవ్వడాన్ని భర్త తట్టుకోలేకపోయాడు. గ్రామంలో లిప్‌స్టిక్‌ పెట్టుకుని, మేకప్‌ వేసుకుని భార్య బయటకు వెళ్లడాన్ని భర్త సహించలేకపోయాడు.

By అంజి  Published on  15 Aug 2024 9:00 AM IST
Karnataka,husband killed his wife, Crime

లిప్‌స్టిక్‌ పెట్టుకొని అందంగా తయారవుతోందని.. భార్యను కిరాతకంగా చంపిన భర్త

భార్య అందంగా రెడీ అవ్వడాన్ని భర్త తట్టుకోలేకపోయాడు. గ్రామంలో లిప్‌స్టిక్‌ పెట్టుకుని, మేకప్‌ వేసుకుని భార్య బయటకు వెళ్లడాన్ని భర్త సహించలేకపోయాడు. అందంగా రెడీ కావొద్దని భార్యతో అనేక సార్లు భర్త గొడవ పడ్డాడు. అయితే భార్య మాత్రం అందంగా రెడీ అయ్యేది. దీంతో భార్యను భర్త మట్టుబెట్టాలనుకున్నాడు. ప్లాన్‌ ప్రకారం.. నమ్మించి బయటకు తీసుకెళ్లి చంపేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.

కర్ణాటకలో రామనగర జిల్లా మాగడికి చెందిన దివ్య (32), ఉమేశ్‌ భార్యా భర్తలు. అందంగా కనిపించేందుకు భార్య దివ్య తన పెదాలకు ఎప్పుడూ లిప్‌స్టిక్‌ వేసుకునేది. చేతికి ఓ టాటూ కూడా వేయించుకుంది. భార్య విషయంలో భర్త ఉమేశ్‌కు ఇది నచ్చేది కాదు. ఈ క్రమంలోనే ఉమేశ్‌ ఆమెతో మాటిమాటికి గొడవ పడేవాడు. భర్త అనుమానపు చూపులు, వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల కిందట మాగడి కుటుంబ కోర్టులో దివ్య విడాకుల పిటిషన్‌ దాఖలు చేసింది.

మంగళవారం ఇద్దరూ విచారణకు హాజరయ్యారు. ఇకపై అనుమానించనని దివ్యను ఉమేశ్‌ నమ్మించాడు. భర్త మారాడనుకునింది భార్య. అతడితో కలిసి దివ్య స్థానిక ఊజగల్లు టెంపుల్‌కు వెళ్లింది. అయితే ఆమెను మర్డర్‌ చేయాలని ముందే పథకం వేసిన ఉమేశ్‌.. దర్శనం అనంతరం అక్కడి కొండ వద్దకు దివ్యను తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న తన నలుగురు స్నేహితులతో కలిసి భార్యను కడతేర్చాడు. మృతదేహాన్ని చీలూరు ఫారెస్ట్‌ ఏరియాలో పడేశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా ఉమేశ్, మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story