Hyderabad: దారుణం.. 14 ఏళ్ల బాలికను తాడుతో కట్టేసి.. వ్యభిచారం చేయించిన పెంపుడు తల్లి

హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిసి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెళ్లి దాడి చేశారు.

By అంజి  Published on  9 May 2024 3:15 PM IST
Hyderabad, Crime, Krishna nagar

Hyderabad: దారుణం.. 14 ఏళ్ల బాలికను తాడుతో కట్టేసి.. వ్యభిచారం చేయించిన పెంపుడు తల్లి 

హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిసి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెళ్లి దాడి చేశారు. ఇద్దరు యువతులు, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో 14 ఏళ్‌ల బాలిక ఉండగా నిర్వాహకురాలు లక్ష్మీని విచారించారు. చిన్నప్పుడే బాలికను తీసుకొచ్చి పెంచి, బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపినట్లు తెలిపింది. జన్మనివ్వకపోయినా పెంచి పెద్ద చేసిన కుమార్తె పట్ల పెంపుడు తల్లి అమానుషంగా వ్యవహరించింది. దీంతో 14 ఏళ్ల బాలికను వ్యభిచార రొంపి నుంచి పోలీసులు కాపాడారు.

బాలిక అధికారులతో మాట్లాడుతూ.. నిర్వాహకురాలు చిన్నప్పుడే తనను తీసుకొచ్చి పెంచిందని తెలిపింది. తాను పుష్పవతి అవ్వగానే ఏడాది నుంచి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దించిందని తెలిపింది. తాను ఒప్పుకోకపోతే తీవ్రంగా కొట్టి, తాడుతో కట్టేసి, మాట వినలేదని జుట్టు మొత్తం కత్తిరించిందని ఏడుస్తూ చెప్పింది. ఆమెకు ఎదురుచెబితే దారుణంగా హింసించేదని వాపోయింది. పోలీసులు బాలికను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలితో పాటు మరికొందరిపై అత్యాచారం, బలవంతంగా వ్యభిచారంలోకి దింపడం వంటి కారణాలతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Next Story