హైదరాబాద్‌లో దారుణం.. కారులో యువతిపై అత్యాచారం.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి..
నేటి సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కామాంధులు ఎవరిని వదిలిపెట్టడం లేదు.
By అంజి Published on 3 July 2024 5:11 PM ISTహైదరాబాద్‌లో దారుణం.. కారులో యువతిపై అత్యాచారం.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి..
హైదరాబాద్: నేటి సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కామాంధులు ఎవరిని వదిలిపెట్టడం లేదు. వారి కామ దాహానికి చిన్నపిల్లలను సైతం బలి చేస్తున్నారు. తాజాగా ఉపాధి కోసం పక్క రాష్ట్రం నుండి హైదరాబాద్‌కు వచ్చిన ఓ యువతి కామాంధుల చేతిలో నలిగిపోయింది. ఈ ఘటన మియాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ యువతి జాబ్ కోసం కడప నుండి హైదరాబాదు నగరానికి వచ్చి ఉప్పల్‌లో నివాసం ఉంటూ మియాపూర్ లోని జె ఎస్ ఆర్ గ్రూప్స్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తోంది. అదే కంపెనీలో సంగారెడ్డి, జనార్ధన్ అనే ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నారు.
ఈ ఇద్దరు సదరు యువతిపై కన్ను వేశారు.. ఆ యువతితో తరుచు మాట్లాడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే యువతికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కారులో తీసుకువెళ్లారు. ఉప్పల్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ యువతిపై సంగారెడ్డి, జనార్ధన్ అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. వారి నుండి తప్పించుకున్న ఆ యువతి నేరుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఉప్పల్ పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకొని వెంటనే ఆ కేసును మియాపూర్ కు బదిలీ చేశారు. ఈ క్రమంలోనే అత్యాచారానికి యత్నించిన కీచకులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి నిందితులు కారులోనే 4 గంటలు పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
రేప్ చేసిన అనంతరం బాధితురాలిని హాస్టల్ ముందు వదిలేసి వెళ్లినట్లు బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో బాధితురాలు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గా తెలిపింది. ఆ కీచకులు నాలుగు గంటలు పాటు కారులో చిత్రహింసలకు గుర్తిచేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. యాదాద్రి లో మీటింగ్ అనంతరం హైదరాబాద్ కి వస్తుండగా కారులో రేప్ చేశారని బాధి తురాలు చెప్పింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో తనతో పాటు పని చేస్తున్న మరో ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ యువతులను కూడా ఇలాగే రేప్ చేశామన్నారని బాధితురాలు తెలిపింది. వైద్యులు బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మియాపూర్ పోలీసులు సంగారెడ్డి, జనార్ధన్ లను అరెస్టు చేశారు.