Hyderabad: దారుణం.. రన్నింగ్‌ బస్సులో మహిళపై లైంగిక దాడి

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై బస్సు క్లీనర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on  22 Sept 2024 12:45 PM IST
Hyderabad, Crime, sexually assaulted, running bus

Hyderabad: దారుణం.. రన్నింగ్‌ బస్సులో మహిళపై లైంగిక దాడి

ఆడవారికి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన కామంధుల్లో మాత్రం మర్పు రావడం లేదు. చివరకు బస్సుల్లో కూడా మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే మరొకటి హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై బస్సు క్లీనర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోటకు చెందిన 28 ఏళ్ల మహిళ.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటోంది. స్వగ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 18వ తేదీన బస్‌ బుక్‌ చేసుకుంది. బస్సు రన్నింగ్‌లో ఉండగా క్లీనర్‌ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు చౌటుప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసును కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలు జర్నీ చేసిన ట్రావెల్స్ బస్సు వివరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Next Story