హైదరాబాద్ నగరంలోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తోప్‌ఖానాలో ఓ వ్యక్తి తన భార్యను, కుమారుడిని హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిరాజ్ నగరానికి బతుకుదెరువు కోసం వలస వచ్చి, తన ఇద్దరు కుమారులు భార్యతో నివాసం ఉంటున్నాడు.
కాగా గురువారం రాత్రి సిరాజ్ భార్య హేలియాను, చిన్న కుమారుడు హైజాన్‌ను గొంతు నులిమి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన పెద్ద కుమారుడు కేకలు పెడుతూ ఇంటి నుంచి పారిపోయాడు. స్థానికుల సహకారంతో బాలుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.