తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. అస్సాంకు చెందిన 24 ఏళ్ల వలస మహిళపై అదే రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని, ఆమె భర్తపై దాడి జరిగిందని ఆరోపించారు. ఆ మహిళ, ఆమె భర్తను ప్రధాన నిందితుడు అస్సాం నుండి ఇటుక తయారీ యూనిట్‌లో పని చేయడానికి తీసుకువచ్చాడు. అయితే ఆ జంట ఇటుక బట్టీలో పని మానేసి తమ సొంత రాష్ట్రానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు.
దీంతో ఆ దంపతుల నిర్ణయం తెలుసుకుని యజమాని వారిని వెళ్లిపోకుండా అడ్డుకునేందుకు మరో ఇద్దరు వ్యక్తులను ఆటోలో తీసుకువచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెల్లింపు సంబంధిత సమస్య గురించి కూడా వారిపై ఆరోపణలు చేసి, వారు ఆ ప్రాంతం నుండి బయటకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. ఆ మహిళను ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారని, అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారని, ఆమె భర్తపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు.