రోడ్డు ప్రమాదంలో ఎస్సై లేడీ సింగం మృతి.. పలు అనుమానాలు వ్యక్తం

వివిధ వివాదాల్లో చిక్కుకున్న అస్సాం పోలీసు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ జున్మోని రభా, నాగావ్ జిల్లాలో తన ప్రైవేట్ కారు

By అంజి  Published on  17 May 2023 7:49 AM GMT
Assam, Lady Singham, cop killed, road accident, Nagaon

రోడ్డు ప్రమాదంలో ఎస్సై లేడీ సింగం మృతి.. పలు అనుమానాలు వ్యక్తం

వివిధ వివాదాల్లో చిక్కుకున్న అస్సాం పోలీసు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ జున్మోని రభా, నాగావ్ జిల్లాలో తన ప్రైవేట్ కారును కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కలియాబోర్ సబ్ డివిజన్‌లోని జఖలబంధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరుభుగియా గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మరణించిన జున్మోని రభా 'లేడీ సింఘం', 'దబాంగ్ కాప్ 'గా ప్రసిద్ధి చెందింది. ప్రమాదం జరిగినప్పుడు ఆమె యూనిఫాం ధరించలేదు, ఆమె కారులో ఒంటరిగా ఉంది.

తెల్లవారుజామున 2:30 గంటలకు సమాచారం అందుకున్న పోలీసు పెట్రోలింగ్ పార్టీ సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు అని జఖలబంధ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ పవన్ కలిత తెలిపారు. మోరికోలాంగ్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మహిళా పోలీసు జున్మోని రభా నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడంలో ప్రసిద్ది చెందింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమె వార్తల్లో నిలిచారు.

గత సంవత్సరం, ఆమె తన కాబోయే భర్తను మోసం ఆరోపణలపై అరెస్టు చేసింది. ఆ తర్వాత అదే కేసులో అరెస్టు చేయబడింది. మజులీ జిల్లాలోని కోర్టు ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఆ తర్వాత ఆమె సర్వీస్ నుండి సస్పెండ్ చేయబడింది. కొన్ని రోజులకు ఆమె సస్పెన్షన్ ఎత్తివేయబడింది. ఆమె తిరిగి సేవలో చేరింది.

యాక్సిడెంట్‌పై దర్యాప్తు చేయాలి

ప్రమాద ఘటనపైనా, మరణానికి ముందు ఆమెపై నమోదైన దోపిడీ కేసుపైనా విచారణ జరుపుతామని సీఐడీ తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైన కంటైనర్‌ లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రక్కు ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉంది. నాగావ్ పోలీస్ సూపరింటెండెంట్ లీనా డోలీ బుధవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

సబ్-ఇన్‌స్పెక్టర్ సివిల్ దుస్తులు ధరించి, తన వ్యక్తిగత వాహనంలో ఎగువ అస్సాం వైపు ఎలాంటి భద్రత లేకుండా ఒంటరిగా ఎందుకు ప్రయాణిస్తున్నారో పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. నాగాన్ సివిల్ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాత జున్మోని రభాను గౌహతిలో దహనం చేశారు.

ఎస్సై మృతిపై అనుమానం

ఈ దుర్ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె కుటుంబం ప్రమాదంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఆమె కదలిక గురించి ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఆమె మృతిపై నిజానిజాలు తెలుసుకోవడానికి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని వారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను అభ్యర్థించారు. ఇది "ఏదో గుర్తుతెలియని రాకెట్ ద్వారా" ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య అని, "ప్రణాళికతో సృష్టించిన" ప్రమాదానికి కారకులైన వారిని శిక్షించి న్యాయం చేయాలని మరణించిన మహిళా పోలీసు తల్లి సుమిత్రా రాభ కోరారు.

జున్మోని రభా అత్త సుబర్ణ బోడో మాట్లాడుతూ.. "సోమవారం రాత్రి, నాగాన్‌లోని జున్మోని అధికారిక క్వార్టర్‌లో పోలీసు ఉన్నతాధికారుల బృందం దాడులు నిర్వహించి సుమారు రూ. 1 లక్షను స్వాధీనం చేసుకుంది. దాడిలో ఆమె తల్లి కూడా ఉన్నారు." జున్మోని తల్లి తన ఇంట్లో కోళ్ల పెంపకం, పందుల పెంపకం వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించిందని ఆమె పేర్కొంది.

Next Story