గుజరాత్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తన 15 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ 24 ఏళ్ల బంధువుని గాంధీనగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బాలికకు బిడ్డ పుట్టగానే, నిందితుడు తన తల్లి, భార్యతో కలిసి నవజాత శిశువును ఉనాలి గ్రామంలోని నిర్జన ప్రదేశంలో విడిచిపెట్టాడు. స్థానిక క్రైమ్ బ్రాంచ్ (ఎల్‌సిబి) పోలీసు ఇన్‌స్పెక్టర్ హెచ్‌పి ఝలా మాట్లాడుతూ.. ఫిబ్రవరి 28న మైనర్ బాలిక బిడ్డను ప్రసవించిందని పోలీసులు తెలుసుకున్నారు. ఎల్‌సీబీ బృందం బాలిక తన తల్లిదండ్రులతో నివసించే గుడిసెకు వెళ్లి విషయాన్ని మరింతగా విచారించింది. గత రెండేళ్లుగా రాంచరడా గ్రామంలో తన అత్తతో కలిసి జీవిస్తున్నట్లు బాలిక పోలీసులకు తెలిపింది.
"తమకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని,పేదరికం కారణంగా వారిని పెంచే స్థోమత లేదని ఆమె తల్లిదండ్రులు ఆమెను అత్త ఇంటికి పంపించారు. ఆమె అత్త వద్ద ఉన్న సమయంలో కజిన్ ఆమెపై పదేపదే అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది "అని ఝాలా చెప్పారు. ఫిబ్రవరి 28న బాలిక ప్రసవ వేదనకు గురైంది. నిందితుడి తల్లి, భార్య ఇంట్లోనే బిడ్డ ప్రసవానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత నవజాత శిశువును ఏకాంత ప్రదేశంలో విడిచిపెట్టారు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో వారు ఆమెను తిరిగి తల్లిదండ్రుల వద్దకు పంపినట్లు ఆయన తెలిపారు. నిందితుడితో పాటు అతని తల్లి, భార్యపై అత్యాచారం, లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు ఝలా తెలిపారు. బాలిక, నవజాత శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు ఉన్నారు.