మహబూబాబాద్ జిల్లాలో ఆర్మీ జవాన్ ఆర్మీ జవాన్ కనిపించకుండా పోయాడు. మరిపెడ మండలం గిరిపురం గ్రామానికి చెందిన నవీన్ అనే ఆర్మీ జవాన్ గత రెండు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. డ్యూటీకి వెళుతున్నానని చెప్పిన నవీన్, డ్యూటీకి వెళ్లకుండా శ్రీశైలం వైపు వెళ్ళినట్లు తెలుస్తోంది. నా కోసం వెతకవద్దు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ బంధువుకు ఫోన్ చేసి చెప్పాడు.
తన సతీమణి అనారోగ్యం కు గురికావడంతో శస్త్ర చికిత్స చేయించడం కోసం ఐదు రోజుల క్రితం ఆర్మీ జవాన్ నవీన్ లీవ్ అడిగాడు. అందుకు ఆర్మీ జనరల్ నవీన్ లీవ్ ను నిరాకరించారు. దీంతో నవీన్ తన ఉన్న తాధికారుల అనుమతి లేకుండా స్వంత గ్రామానికి వచ్చి భార్యకు శస్త్ర చికిత్స చేయించాడు.
హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణమైన నవీన్, తన డ్యూటీకి హాజరు కాకుండా శ్రీశైలం వైపు కారులో వెళ్లినట్టు సమాచారం. శ్రీశైలం డ్యాం సమీపంలోని ప్రాంతం నుంచి తన బంధువుకు ఫోన్ చేసిన నవీన్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. డ్యాం సమీపంలోని కారు లోపల పురుగుల మందు బాటిల్, మొబైల్ ఫోన్ వదిలి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈగలపెంట పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.