ఏపీ హైకోర్టు న్యాయవాది అరెస్ట్..!

AP High Court Lawyer arrested in Telangana.మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై తెలంగాణ‌లోని

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 1 Sept 2021 11:29 AM IST

ఏపీ హైకోర్టు న్యాయవాది అరెస్ట్..!

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చ‌ర్ల‌లో ఏపీ హైకోర్టు న్యాయ‌వాది అంకాల పృథ్వీరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజ‌యవాడ‌కు చెందిన ఆయ‌న్ను మంగ‌ళ‌వారం అదుపులోకి తీసుకున్నారు. పృథ్వీరాజ్‌ను విచారించగా పూసుగుప్ప- చత్తీస్‌గఢ్‌లోని రాంపురం-మల్లంపేట అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేత దామోదర్‌ను కలిసి వస్తున్నట్టుగా వెల్లడైందని పోలీసులు తెలిపారు.

ఆగ‌స్టు 7వ తేదీన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన శైలేంద్ర ముఖర్జీ మ‌ర‌ణించాడు. ఆయన ఆశయాలను కొనసాగించాలని.. ఉన్న కరపత్రాలను పృథ్వీరాజ్‌ నుంచి స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన అనంత‌రం న్యాయ‌స్థానానికి త‌ర‌లించిన‌ట్లు చెప్పారు.

Next Story