మహబూబ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీ పోలీసుతో పాటు ముగ్గురు మృతి

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.

By అంజి  Published on  22 Feb 2024 8:47 AM IST
AP cop, three killed, road accident, Mahabubnagar

మహబూబ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీ పోలీసుతో పాటు ముగ్గురు మృతి

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటన భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మృతులను సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకట రమణ (57), అతని అల్లుడు పవన్ సాయి (25), డ్రైవర్ చంద్ర (23)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వెంకట రమణ కుమార్తె అనూషను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో జరిగిన ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అనూషకు హైదరాబాద్‌కు చెందిన పవన్ సాయితో ఫిబ్రవరి 15న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని పవన్‌సాయి ఇంట్లో ఓ కార్యక్రమం ముగించుకుని ఆమె తన భర్త, తండ్రితో కలిసి అనంతపురం వెళ్తున్నారు. వెంకట రమణ ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పీపుల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story