హైదరాబాద్‌లో మరో అక్రమ సరోగసి సెంటర్ గుట్టురట్టు..పేదమహిళలే వీరి టార్గెట్

హైదరాబాద్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఘటన మరువక ముందే మరో ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

By Knakam Karthik
Published on : 15 Aug 2025 3:06 PM IST

Crime News, Hyderabad, Illegal surrogacy center

హైదరాబాద్‌లో మరో అక్రమ సరోగసి సెంటర్ గుట్టురట్టు..పేదమహిళలే వీరి టార్గెట్

హైదరాబాద్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఘటన మరువక ముందే మరో ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పరిధిలో అక్రమ సరోగసి సెంటర్ ఉన్నట్లుగా తెలియడంతో పోలీసులు దాడులు చేశారు . ఒక క్లినిక్ సెంటర్ అనుమతి లేకుండానే సరోగసి సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. క్లినిక్ సెంటర్‌పై దాడులు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. అనుమతులు లేకుండానే ఎగ్ డొనేట్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ క్లినిక్ గతంలో అనుమతికి అప్లై చేసింది కానీ అనుమతులు రాకపోయినా అక్రమంగా సరోగసి సెంటర్ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ..అక్రమ సరోగసీకి పాల్పడుతున్న వ్యక్తుల్ని, ఎగ్ డొనేట్ చేస్తున్న వారిని అరెస్ట్ చేశాం. హైదరాబాద్‌లో ఏడుగురు, ఒక పురుషున్ని మొత్తం 8 మందిని కమర్షియల్ సరోగసీ, అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తూ పట్టుబడ్డారు. పిల్లలు లేని జంటలను టార్గెట్‌గా చేసుకుని నిందితులు 15- 20 లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి గతంలో ఎగ్ డోనర్, సరోగసి మదర్‌గా పని చేసిన అనుభవం ఉంది. గత అనుభవంతో సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని అక్రమ సరోగసి విధానానికి తెరలేపి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. లక్ష్మీ రెడ్డి కుమారుడు A2 నిందితుడు నరేందర్ రెడ్డి JNTU లో కెమికల్ ఇంజనీరింగ్ చదివాడు. అమ్మకి తోడుగా ఈ వ్యాపారంలోకి దిగాడు. డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను టార్గెట్‌గా చేసుకుని ఎగ్ డొనేట్ చేయించడంతోపాటు, సరోగసికి ఒప్పిస్తున్నారు. నిందితుల దగ్గర నుంచి 6.47 లక్షల నగదు, లెనోవో ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.

Next Story