హైదరాబాద్‌లో మరో దారుణం.. భర్తను చంపిన భార్య.. ప్రియుడి కోసం..

వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. వారి పిల్లలు అనాథలు అవుతున్నారు.

By అంజి
Published on : 30 Aug 2025 8:03 AM IST

Hyderabad, Wife kills husband with boyfriend, Crime

హైదరాబాద్‌లో మరో దారుణం.. భర్తను చంపిన భార్య.. ప్రియుడి కోసం.. 

వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. వారి పిల్లలు అనాథలు అవుతున్నారు. అయినా కూడా ఎక్కడో చోట దంపతుల్లో ఎవరో ఒకరు వివాహేతర సంబంధం పెట్టు కోవడం... చివరకు ఎవరో ఒకరు హత్యకు గురవ్వడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇటువంటి సంఘటనే మరొకటి హైదరాబాద్ సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

జెల్లెల శేఖర్ (40), చిట్టి (33) దంపతులు.. వీరు సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. శేఖర్ వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే డ్రైవింగ్ వృత్తిపై శేఖర్ అప్పుడప్పుడు రెండు, మూడు రోజులు లేదంటే వారం రోజులపాటు బయట ప్రాంతాలకు వెళ్లేవాడు. అదే సమయంలో చిట్టికి హరీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో చిట్టి, హరీష్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన భర్త శేఖర్ కు భార్య చిట్టి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో విషయం తెలుసుకున్నాడు. భార్య చేస్తున్న పని తప్పని పలుమార్లు హెచ్చరించాడు. అయినా కూడా చిట్టి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవ జరిగేది.

తమ సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్తను ఎలాగైనా సరే అంతం చేయాలని భార్య చిట్టి పథకం వేసింది. పథకం ప్రకారమే రాత్రి సమయంలో తన ప్రియుడు హరీష్ ని పిలిచింది. గాఢ నిద్రలో ఉన్న భర్త శేఖర్ గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఉదయం ఏమీ తెలియనట్లుగా తన భర్త నిద్రలోనే చనిపోయాడంటూ నానా హంగామా సృష్టిస్తూ డయల్ 100 కి ఫోన్ చేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో పోస్టు మార్టం నివేదికలో హత్య అని తేలడంతో పోలీసులు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు. అనంతరం పోలీసులు మృతుడు శేఖర్ భార్య చిట్టి ప్రవర్తన పై అనుమానం కలిగి ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా... తానే తన ప్రియుడి తో కలిసి తన భర్తను హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. దీంతో పోలీసులు వెంటనే చిట్టిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story