మైనర్‌ బాలిక హత్య కేసు.. నిందితుడు అరెస్ట్‌

చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చేబ్రోలు మండలం కొత్తారెడ్డిపాలెం గ్రామంలో గత జులై 15న మైనర్‌ బాలికను హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేశారు.

By అంజి  Published on  3 Dec 2024 2:50 AM GMT
AndhraPradesh, Chebrolu police, arrest, minor girl, murder case

మైనర్‌ బాలిక హత్య కేసు.. నిందితుడు అరెస్ట్‌

విజయవాడ: చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చేబ్రోలు మండలం కొత్తారెడ్డిపాలెం గ్రామంలో గత జులై 15న మైనర్‌ బాలికను హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నరమామిడి నాగరాజు(44). రాజమహేంద్రవరంలోని స్పిన్నింగ్‌ మిల్లులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. నాగరాజుకు రెండు కేసుల్లో ప్రమేయం ఉంది. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ హత్యకేసు అందులో ఒకటి.

నాగరాజు కోసం తెనాలి డీఎస్పీ జనార్దన్‌రావు ఆధ్వర్యంలో 8 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన ఈ బృందాలు ఎట్టకేలకు పోలీసు ఇన్‌ఫార్మర్‌ ఇచ్చిన సమాచారం మేరకు రాజమండ్రిలో నిందితుడిను అరెస్టు చేశారు. అరెస్టుకు కృషి చేసిన తెనాలి పోలీసు అధికారి టి జనార్దన్‌రావు, పొన్నూరు, చేబ్రోలు స్టేషన్ల సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

Next Story