దారుణం..వ్యభిచారానికి నిరాకరించిందని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు
ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik
దారుణం..వ్యభిచారానికి నిరాకరించిందని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు
ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యభిచారం చేయడానికి నిరాకరించిందనే కారణంతో 22 ఏళ్ల మహిళలను ఆమె ప్రియుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజోలు మండల పరిధిలోని బి సవరం గ్రామంలోని సిద్ధార్థ నగర్‌లో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. బాధితురాలు ఓలేటి పుష్ప తన భర్త నుండి విడిపోయిన తర్వాత గత ఆరు నెలలుగా 22 ఏళ్ల షేక్ షమ్మతో నివసిస్తోంది. వారు గ్రామంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అయితే, షేక్ షమ్మం చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బు కోసం పుష్పను వ్యభిచార వృత్తిలోకి దింపాలని గట్టిగా యత్నించాడు. ఇలా ఎన్నిసార్లు అడిగినా ఆమె ఒప్పుకోకుండా.. ధైర్యంగా ఎదురిస్తూ వచ్చింది.
కానీ..బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో, షమ్మ మళ్ళీ తనతో పాటు లైంగిక పనికి రావాలని పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆమె నిరాకరించడంతో, అతను ఆమెపై కత్తితో దాడి చేసి, ఆమె ఛాతీ ఎడమ వైపు, కాలు మీద పొడిచాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పుష్ప తల్లి గంగ, ఆమె సోదరుడిపై కూడా షమ్మ దాడి చేశాడు. అధిక రక్తస్రావం కారణంగా పుష్ప అక్కడికక్కడే మరణించింది. కాగా ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడి వివరాలు సేకరించారు. రాజోలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం రెండు పోలీసు బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు.