అనంతపురం: అదుపు తప్పిన ప్రైవేటు బస్సు.. ఐదుగురు..

Anantapur Road accident ... ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పింది. పాలసముద్రం సమీపంలో

By సుభాష్  Published on  12 Nov 2020 5:15 AM GMT
అనంతపురం: అదుపు తప్పిన ప్రైవేటు బస్సు.. ఐదుగురు..

ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పింది. పాలసముద్రం సమీపంలో ఎన్‌హెచ్‌ -44పై గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

బస్సు అతి వేగంగా ఉండటం, వేగాన్ని నియంత్రించుకోలేకపోవడంతో పక్కనున్న పంట కాలువలోకి వెళ్లడంతో ముందు భాగం కాలువలో కూరుకుపోగా, వెనుక భాగం గాల్లో తేలియనట్లుగా ఉండిపోయింది. ఈ అయితే డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it