ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్‌కు వెళ్లిన కాసేపటికే..

బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

By అంజి  Published on  21 Oct 2024 9:11 AM IST
inter student, suicide, private college , Bachupally, Hyderabad, Crime

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్‌కు వెళ్లిన కాసేపటికే.. 

హైదరాబాద్‌: బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు అనూష బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో చదువుతోంది.

ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అనూష దసరా సెలవులకు తన ఇంటికి వెళ్ళింది. సెలవులు పూర్తి కావడంతో నిన్న తల్లిదండ్రులు అనూషను హాస్టల్‌లో వదిలేసి వెళ్లిపోయారు. ఏం జరిగిందో ఎమో తెలియదు కానీ అనూష తన తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత హాస్టల్‌లో ఉన్న తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్నేహితులు వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్‌కు తెలియజేశారు.

దీంతో కాలేజీ యాజమాన్యం.. తల్లి దండ్రులు సిటీ దాటిలోపే అనూష స్పృహ కోల్పోయిందని సమాచారం ఇచ్చారు. కాలేజీకి వెళ్ళేసరికి అనూష ఊరి వేసుకుని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపారు. తల్లితండ్రులు వచ్చే సరికి అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని హాస్టల్‌లో ఉండటంపై అనాసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story