ఆడబిడ్డకు జన్మనిచ్చి ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతి.. కాలేజీ హాస్టల్‌లోనే..

ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని.. కాలేజీ హాస్టల్‌లోనే ప్రసవించింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స మృతి చెందింది.

By అంజి  Published on  28 Jan 2024 6:50 AM IST
engineering student, college hostel, APnews, Crimenews

ఆడబిడ్డకు జన్మనిచ్చి ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతి.. కాలేజీ హాస్టల్‌లోనే..

ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని.. కాలేజీ హాస్టల్‌లోనే ప్రసవించింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స మృతి చెందింది. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. సమాచారం బయటకు తెలియడంతో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. పాణ్యం ఇంచార్జి సీఐ శివ కుమార్‌ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్‌ రెండవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని శుక్రవారం నాడు అర్ధరాత్రి తనకు కడుపునొప్పిగా ఉందని రాత్రి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి హాస్టల్‌కు రమ్మని చెప్పింది. ఆ సమయంలోనే తల్లిదండ్రులు హాస్టల్‌కు బయల్దేరారు. అయితే కడుపు నొప్పి ఎక్కువ కావడంతో విద్యార్థిని బాత్‌రూమ్‌కు వెళ్లింది.

సమయం చాలా సేపు గడిచినా విద్యార్థిని బయటకు రాలేదు. దీంతో తోటి స్నేహితులు, అప్పటికే హాస్టల్‌కు చేరుకున్న తల్లిందడ్రులు తలుపును బద్దలుకొట్టారు. అయితే అప్పటికే ఆ విద్యార్థి ఆడబిడ్డకు జన్మనిచ్చి రక్తపుమడుగులో పడి ఉంది. విద్యార్థినిని తల్లిదండ్రులు వెనువెంటనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్ర రక్తస్రావంతో కోలుకోలేక విద్యార్థి మృతి చెందగా పసిబడ్డి ఆరోగ్యంగా ఉంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story