11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. 9 మంది అరెస్ట్

An 11-year-old girl was gang-raped in Maharashtra. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. దాదాపు నెల రోజుల పాటు 11 ఏళ్ల బాలికపై కొందరు యువకులు

By అంజి  Published on  28 July 2022 6:40 PM IST
11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. 9 మంది అరెస్ట్

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. దాదాపు నెల రోజుల పాటు 11 ఏళ్ల బాలికపై కొందరు యువకులు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్‌ జిల్లాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంలో జూన్ 19 నుంచి జూలై 15 మధ్య ఈ ఘటన జరిగింది. బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. బాధితురాలి తల్లిదండ్రులు ప్రతి రోజు కూలీ పనికి వెళ్తారు. ప్రధాన నిందితుడు రోషన్ కర్గాంకర్‌ బాధితురాలి ఇంటి సమీపంలో నివాసం ఉంటున్నాడు.

నిందితుడు జూన్ 19న బాలిక ఇంటికి వెళ్లి తనతో పాటు ఓ ప్రదేశానికి రమ్మని కోరినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాలికను తన ఇంటికి తీసుకెళ్లి స్నేహితుడు గజానన్‌తో కలిసి అత్యాచారం చేశాడు. జరిగిన ఘటనను ఎవరికీ చెప్పొద్దని నిందితుడు బాధితురాలికి కొంత డబ్బు కూడా ఇచ్చాడని పోలీసుల తెలిపారు. కొన్ని రోజుల తర్వాత నిందితుడి స్నేహితులు మళ్లీ కర్గాంకర్ ఇంట్లో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూలై 15న గజానన్, అతని మరో ఇద్దరు స్నేహితులు బాలికను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

జరిగిన ఘటన గురించి కొంత సమాచారం అందడంతో బాధితురాలిని సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు, పోలీసులకు వివరించింది. నిందితులపై సెక్షన్ 3769 డి) (గ్యాంగ్ రేప్), 376 (2) (ఎన్) (ఒకే మహిళపై పదే పదే అత్యాచారం చేసినా), 506 (నేరపూరిత బెదిరింపు) ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి), పోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. అరెస్టయిన నిందితులను రోషన్ కర్గాంకర్ (29), అతని స్నేహితులు ప్రేమదాస్ గతిబంధే (38), గజానన్ ముర్స్కర్ (24), గోవింద నాటే, రాకేష్ మహాకల్కర్ (40), సౌరభ్ (22), నితేష్ ఫుకట్ (30), నరులే, ప్రదుమ్నా కరుత్కర్ (22), నిఖిల్ అలియాస్ పిక్కూగా గుర్తించారు.

Next Story