జనవరి 10న ఆగ్నేయ ఢిల్లీలోని సన్‌లైట్ కాలనీలో 22 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ ను హత్య చేసినందుకు 21 ఏళ్ల విద్యార్థితో సహా ఇద్దరు వ్యక్తులను ఆదివారం అరెస్టు చేశారు. డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ ఈస్ట్) ఈషా పాండే మాట్లాడుతూ మరణించిన ట్రాన్స్‌పర్సన్‌ని ఆశ్రమ్ ప్రాంత నివాసి అభిషేక్ తోమర్ అలియాస్ మినాల్‌గా గుర్తించినట్లు తెలిపారు. నిందితులను స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్‌లో గ్రాడ్యుయేషన్ చదువుతున్న స్వరూప్ నగర్ నివాసి హిమాన్షు కుమార్, హిమాన్షు తండ్రికి చెందిన స్పేర్ పార్ట్స్ షాపులో పనిచేస్తున్న అజంగఢ్‌కు చెందిన సోను కుమార్ (20)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాన్షుకు మినాల్ తో సంబంధం ఏర్పడింది. తనకు డబ్బు ఇవ్వకుంటే తమ సంబంధాన్ని హిమాన్షు తండ్రికి చెబుతానని బెదిరించడంతో సోనూ సహాయం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి మినాల్‌ను చంపేశారు. జనవరి 11న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి కంట్రోల్ రూమ్ కాల్ వచ్చిందని, ట్రాన్స్‌పర్సన్ చనిపోయినట్లు ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులని విచారించారు. ఆ తరువాత హత్య కేసు నమోదు చేయబడింది. సిసిటివి ఫుటేజీ సహాయంతో, ఇద్దరు నిందితులను ఆదివారం వారి నివాసంలో గుర్తించి అరెస్టు చేశారని పాండే చెప్పారు.