సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఫామ్‌హౌస్‌లో ఎయిర్‌గన్ పేలి బాలిక మృతి
Air Gun Miss fire in Sangareddy District Girl dead.సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిన్నారం మండలం
By తోట వంశీ కుమార్ Published on
16 March 2022 5:52 AM GMT

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిన్నారం మండలం వావిరాల వద్ద ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో ఎయిర్‌గన్ పేలి ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న జిన్నారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. పిల్లలు గన్ తో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బాలిక మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Next Story