మనవడిని కిడ్నాప్ చేసి చంపిన మహిళ, ఆమె సోదరుడు.. అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో తన మనవడిని కిడ్నాప్ చేసి చంపినందుకు ఒక మహిళ, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 19 Sep 2024 2:45 AM GMTమనవడిని కిడ్నాప్ చేసి చంపిన మహిళ, ఆమె సోదరుడు.. అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో తన మనవడిని కిడ్నాప్ చేసి చంపినందుకు ఒక మహిళ, ఆమె సోదరుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాలోని అమనాబాద్ గ్రామానికి చెందిన కల్పనా శర్మగా గుర్తించిన నిందితురాలు తన 5 ఏళ్ల మనవడు మయాంక్‌ను ఆమె సోదరుడు లలిత్ శర్మకు రూ. 15 లక్షలు ఇచ్చి కిడ్నాప్ చేయించింది. బయట ఆడుకుంటున్న మయాంక్‌ని ఇంటికి పిలిచి 10 నిద్రమాత్రలను నీళ్లలో కలిపి తాగించింది. మయాంక్ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత, లలిత్ శర్మ అతనిని గోనె సంచిలో వేసుకుని తన మోటర్‌బైక్‌పై గ్రామం నుండి బయటకు తీసుకెళ్లాడు.
చాలా సేపటికి కూడా మయాంక్ స్పృహలోకి రాకపోవడంతో, లలిత్ చనిపోయే అవకాశం ఉందని భయపడి, అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని కాల్వలో విసిరి, అరెస్టుకు భయపడి ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి బాలుడిని కాల్వలో పడేసినట్లు కల్పనకు కూడా చెప్పాడు. దురదృష్టవశాత్తు బాలుడి నీటిలో మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కాల్వలోంచి మయాంక్ మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. నీట మునిగి మృతి చెందినట్లు స్పష్టమైందని సీనియర్ పోలీసు అధికారి సునమ్ కుమార్ తెలిపారు.
కొంత కాలం తర్వాత బాలుడి కుటుంబీకులకు లలిత్ శర్మపై అనుమానం వచ్చింది.. పోలీసులు అతడిని విచారించి ఆ రోజు గ్రామానికి వచ్చి వెళ్లే వారి వివరాలను సేకరించారు. చివరకు ఈ మొత్తం కుట్రకు సూత్రధారి కల్పనా శర్మ అని పోలీసులు తెలిపారు. "మయాంక్ తాత సుబేదార్ శర్మ ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాడని, అతని పదవీ విరమణ నిధులు పొందాడని కల్పనకు తెలిసింది. ఈ నిధి కోసం అత్యాశతో ఆమె తన సోదరుడితో కలిసి ఈ కుట్ర పన్నింది. మయాంక్‌పై కిడ్నాప్ ప్లాన్ వేసింది. అతనిని గ్రామం నుండి బయటకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేసింది, అయితే కల్పన పది నిద్ర మాత్రలను నీటిలో కలిపింది, దానితో పిల్లవాడు నిద్రపోలేదు, కానీ స్పృహ కోల్పోయాడు" అని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు కల్పన, లలిత్‌లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.