అత్యాచారం తర్వాత.. నిందితుడు బాధితురాలిని కలిసేందుకు వెళ్తే..

After sexual assault, accused went to meet the victim. యూపీలోని ముజఫర్‌నగర్‌లోని చెరకు తోటలో అర్ధనగ్న స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న

By అంజి  Published on  13 March 2022 8:05 AM GMT
అత్యాచారం తర్వాత.. నిందితుడు బాధితురాలిని కలిసేందుకు వెళ్తే..

యూపీలోని ముజఫర్‌నగర్‌లోని చెరకు తోటలో అర్ధనగ్న స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ముజఫర్‌నగర్‌లోని టిటావి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాగ్లా పితోరా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం, గ్రామానికి చెందిన 33 ఏళ్ల ప్రదీప్ అలియాస్ సోను మృతదేహం చెరుకు తోటలో పాక్షిక నగ్న స్థితిలో పడి ఉంది.

యువకుడి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతుడి బంధువు అంకిత్‌కు గ్రామంలోని ఓ కుటుంబంతో పాత శత్రుత్వం ఉందని ఆరోపించాడు. దీంతో ఈ హత్య జరిగిందన్నాడు. తన సోదరుడు కూడా కొన్నేళ్ల క్రితం అత్యాచారం కేసులో జైలుకు వెళ్లాడని అంకిత్ చెప్పాడు. అయితే రెండేళ్ల క్రితం బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. శనివారం ఉదయం సోను బాధిత మహిళను కలిసేందుకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతనిపై బాధితురాలు అత్యాచారం ఆరోపణలు చేసింది. దీంతో నేరస్థుల బృందం కర్రలతో సోనూ ఇంటికి చేరుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వారిని చూసిన సోను ఇంటి నుంచి పారిపోయాడు. మార్గమధ్యంలో ఎక్కడో సోనును హత్య చేసి మృతదేహాన్ని చెరకుతోటలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Next Story
Share it