రొట్టె ముక్క కోసం దాబాకు వెళ్తే.. యువతి బంధించి 12 రోజులుగా అత్యాచారం

Adivasi woman gang raped by 3 accused in Madhyapradesh. రొట్టె ముక్క కోసం దాబాకు వెళ్లిన ఓ 26 ఏళ్ల యువతిపై అక్కడి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు.

By అంజి  Published on  15 Dec 2022 3:18 PM IST
రొట్టె ముక్క కోసం దాబాకు వెళ్తే.. యువతి బంధించి 12 రోజులుగా అత్యాచారం

రొట్టె ముక్క కోసం దాబాకు వెళ్లిన ఓ 26 ఏళ్ల యువతిపై అక్కడి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. యువతిని 12 రోజుల పాటు లైంగికంగా చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నదన్ దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓ గిరిజన మహిళపై దాబాలో బందీగా ఉంచి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాబా యజమాని, వంట మనిషి, ఉద్యోగి కలిసి మహిళపై దాదాపు పన్నెండు రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సాత్నా జిల్లాలో ఆకలితో ఉన్న మహిళపై రొట్టెల కోసం దాబా వద్దకు వెళ్లింది. అక్కడి సిబ్బంది రొట్టెలు అడిగింది. నిందితులు ఆమెను దాబాలో బందీగా ఉంచారు. ఆమెతో 12 రోజులు తప్పుడు పనులు చేశారు. అవకాశం రావడంతో.. ఆ మహిళ దాబా నుండి పారిపోయి, నాదన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత పోలీసులకు తన బాధను వివరించింది. మహిళ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కంచన్ దాబా యజమానితో పాటు వంట మనిషి, ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. NH-30 హైవేపై ఉన్న కంచన్ ధాబా వద్ద 26 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. మహిళ మైహార్ నివాసి. చాలా రోజుల పాటు దాబాలో బందీగా ఉంచి ఆమెపై అత్యాచారం చేశారు. దాబా యజమాని రాజేంద్ర పటేల్, మౌగంజ్ నివాసి జరియారి లల్లూ యాదవ్, రిగ్రా నివాసి సన్నీ సాకేత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళ 12 రోజుల క్రితం కోపంతో తన ఇంటిని వదిలి కాలినడకన లాల్‌పూర్‌లోని తన సోదరి ఇంటికి బయలుదేరింది, ఆకలితో రొట్టెలు అడగడానికి దాబాకు వెళ్లింది. ఈ క్రమంలో నిందితులు ఆమెను బందీగా తీసుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం, ఆమె ఎలాగో అవకాశం దొరకడంతో తప్పించుకుని, నదన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత పోలీసులకు తన బాధను వివరించింది. నిందితులపై ఐపీసీ 376, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story