ప్రభాస్ సాయం చేశార‌న్న వార్తల్లో నిజం లేదు

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభాస్ ఆర్థిక సాయం చేశారంటూ వస్తున్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది.

By Medi Samrat
Published on : 5 July 2025 5:15 PM IST

ప్రభాస్ సాయం చేశార‌న్న వార్తల్లో నిజం లేదు

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభాస్ ఆర్థిక సాయం చేశారంటూ వస్తున్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వెంకట్ భార్య సువర్ణ స్పష్టం చేశారు. ప్రభాస్ గారు ఆర్థిక సాయం చేశారని వస్తున్న వార్తలు అవాస్తవం. బహుశా మా కష్టం గురించి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. విషయం తెలిస్తే ఆయన తప్పకుండా సాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు ఫిష్ వెంకట్ భార్య సువర్ణ. మాకు అంత పెద్ద మొత్తంలో ఖర్చు భరించే స్తోమత లేదు. కిడ్నీ దానం చేస్తామని కొందరు వస్తున్నా, వారు కూడా డబ్బులు అడుగుతున్నారన్నారు. దయచేసి సినీ పెద్దలు, దాతలు స్పందించి తమకు అండగా నిలవాలని కోరారు. ప్రస్తుతం ఐసియులో ప్రాణాలతో పోరాడుతున్న ప్రముఖ హాస్యనటుడు ఫిష్ వెంకట్ కు ప్రభాస్ ఆర్థిక సహాయం అందించారని పలు మీడియా సంస్థలు నివేదించాయి.

Next Story