ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో..
Accident In Prakasham District. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో
By Medi Samrat Published on
7 Jan 2021 3:39 AM GMT

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాతపడగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మార్టూరుకు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులోనే మృతదేహలు చిక్కుకుపోవడంతో పోలీసులు, హైవే సిబ్బంది శ్రమించి బయటకు తీశారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.
కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పర్వతనేని వెంకట విజయ లక్ష్మి, ఆర్.కనకమహాలక్ష్మి, బలిజ సత్యన్నారాయణ, హైదరాబాద్‌లోని కూకట్‌ల్లికి చెందిన ఉయ్యూరు చినబాబు, సందీప్‌తో పాటు మరో వ్యక్తి తిరుమలకు వెళ్లి కారులో ఊరికి తిరిగివస్తున్నారు. మార్టూరుకు సమీపంలోని జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Next Story