మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15మంది మృతి

Accident In Maharastra. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్గావ్‌ జిల్లాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో 15మంది మృతి చెందారు.

By Medi Samrat  Published on  15 Feb 2021 9:41 AM IST
Accident In Maharastra

జల్గావ్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్గావ్‌ జిల్లాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో 15మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ధులే నుంచి రావెర్ ప్రాంతానికి అరటి లోడ్​తో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రక్కులో 21 మంది కూలీలు ఉన్నారు.


స‌మాచారం అందుకున్న పోలీసులు.. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే బాధితులు ప్ర‌యాణిస్తున్న ట్ర‌క్కు అదుపుత‌ప్పి బోల్తా ప‌డ‌టంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story