కారును ఢీ కొట్టిన టిప్పర్​ లారీ : ముగ్గురు మృతి

Accident In Mahaboobnagar District. పండ‌గ‌పూట విషాదం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలం పరిధిలో

By Medi Samrat  Published on  11 March 2021 4:02 AM GMT
కారును ఢీ కొట్టిన టిప్పర్​ లారీ : ముగ్గురు మృతి

పండ‌గ‌పూట విషాదం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్​ లారీ ఎదురుగా వచ్చిన కారును ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను ఆస్ప‌త్రికి తరలిస్తుండ‌గా.. వారిలో మరొక వ్య‌క్ది మత్యువాత ప‌డ్డారు.

మంగనూర్​కు చెందిన నలుగురు వ్యక్తులు మారుతీ కారులో భూత్పూర్‌ వైపు ప్రయాణిస్తుండగా ఆ ప్రమాదం చోటుచేసుకుంది. మంగనూరుకు చెందిన సత్యనారాయణ గౌడ్(35), వెంకటయ్య గౌడ్(47) అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


Next Story
Share it