రోడ్డుప్రమాదాలు తగ్గడం లేదు. నిత్యం ఏదో ఓ మూలన రహదారులు నెత్తురోడుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జంగారెడ్డిగూడెం బైపాస్‌లో శ్రీనివాసపురం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్తున్న ట్రాక్టర్‌ని లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో.. 108 సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రయాణికులది కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామ శివారు కండ్రిక. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.