హైదరాబాద్‌లో దారుణం.. వ్యక్తిని కిడ్నాప్‌ చేసి బట్టలు ఊడదీసి.. ఆ తర్వాత

Abducted man stripped naked, brutally thrashed with belt by gang in Hyderabad. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంగర్ హౌస్ ప్రాంతంలో యువకుల ముఠా

By అంజి  Published on  8 Dec 2022 3:14 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. వ్యక్తిని కిడ్నాప్‌ చేసి బట్టలు ఊడదీసి.. ఆ తర్వాత

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంగర్ హౌస్ ప్రాంతంలో యువకుల ముఠా అపహరించిన ఓ వ్యక్తి కిడ్నాప్‌ చేసింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన డిసెంబర్ 6 మంగళవారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ఎండీ ఇర్ఫాన్ అనే వ్యక్తిని అదే ప్రాంతంలోని యువకుల బృందం వేధింపులకు గురి చేశారు. ఆ ముఠా అతడిని అపహరించి, రాజేంద్రనగర్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం లోపలికి తీసుకెళ్లి బెల్టుతో దారుణంగా కొట్టారు. ఆ తర్వాత అతడిని చెత్తకుప్పల్లో పడేశారు.

ఈ తతంగాన్ని యువకులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వ్యక్తి ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. వివాదం నేపథ్యంలో నలుగురు యువకులు ఇర్ఫాన్‌ అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేసి కొట్టారు. వారి మధ్య గతంలో ఉన్న వైరమే ఈ దాడికి కారణం. ఐపీసీ సెక్షన్‌ 394తో పాటు సంబంధిత సెక్షన్ల కింద రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Next Story